నవ యువకులు...90 ఏళ్ళే కోలకతా : ఆయన రోజూ తెల్లవారు జామున 4 గంటలకు నిద్ర లేచి, గురుసదయ్ రోడ్డులోని తన నివాసంలోని సువిశాల పచ్చికబయలుపై రెండు గంటల సేపు వ్యాహ్యాళి సాగిస్తారు. ఉదయం 9 గంటలకల్లా తన ఆఫీసుకు బయలుదేరతారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయన ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆఫీసులో ఉంటూ తన కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూస్తుంటారు.
బి.కె. బిర్లా జనవరి 12న కూడా ఇదే దైనందిన కార్యక్రమం సాగించారు. ఆ రోజు ఆయన 90వ జన్మదినం. 'భగవంతునిపై నా విశ్వాసం, క్రమశిక్షణతతో కూడిన జీవితం నాకు ఇందుకు దోహదం చేస్తున్నాయి' అని బి.కె. బిర్లా చెప్పారు. 'నేను ఇంటికి తిరిగి చేరుకున్న తరువాత బంధువులతో లేదా మిత్రులతో మాట్లాడుతుంటాను, కొంత సేపు టివి చూస్తుంటాను' అని కోలకతాలో భారీ వాణిజ్య సంస్థ అధినేత బిర్లా తెలియజేశారు. బికె బిర్లా, ఆయన వంటి వారు ఇంకా అనేక మందికి వయస్సు ఒక సంఖ్య మాత్రమే. 90 ఏళ్ల వయస్సులో వారి జీవన సరళి యువకుల మాదిరిగానే ఉంటుంది.
జోసెఫ్ చిరామల్ మరొక అడుగు ముందుకు వేశారు పార్క్ సర్కస్ సమీపంలోని ఆయన రెండు బెడ్ రూమ్ ల ఇంటి లో డోర్ బెల్ మోగీమోగనట్లుగా శబ్దం చేస్తుంది. ఇది ఇతర కుటుంబ సభ్యుల చెవుల పడలేదు. కాని చిరామల్ పాము చెవులకు అది వినిపించింది. ఆయన తాను చదువుతున్న బైబిల్ ను మూసివేసి తలుపు తెరుస్తారు. చిరామల్ జనవరి 25న 101వ పడిలోకి పడతారు. '88 ఏళ్ల వయస్సులో ఆయన పార్క్ సర్కస్ మార్కెట్ కు వెళ్లి బజారు పని చేస్తుండేవారు. 98 ఏళ్ల వయస్సులో ఆయన ఆదివారాలు ఎవరి తోడూ లేకుండానే చర్చికి నడిచి వెళుతుండేవారు. ఇప్పుడు 100 ఏళ్ల వయస్సులో ఆయన సోమవారాల్లో ఉదయం పూట చర్చి వసూళ్ల లెక్కింపు కోసం కమ్యూనిటీ హాల్ కు వెళుతుంటారు' అని ఆయన 69 ఏళ్ల కుమార్తె గ్రేస్ తెలియజేశారు.
చిరామల్ ఇప్పటికీ ఆనందమయ జీవితం గడుపుతుంటారు. 'నాకు బ్రిడ్జి ఆట బాగా ఇష్టం... మీ మనస్తత్వం యువకులను పోలి ఉంటే శరీరంలో కూడా యువరక్తం పారుతుంటుంది' అని ఆయన బోసి నవ్వుతో చెబుతుంటారు. ఆ శతాయుష్కుని ఇంటికి సమీపంలోనే 94 ఏళ్ల తులారామ్ అగర్వాల్ నివసిస్తుంటారు. పార్క్ సర్కస్ సమీపంలోని గోరాచంద్ రోడ్ నివాసి అయిన అగర్వాల్ దైనందిన కార్యక్రమాలు 5 గంటలకు యోగాసనాలతో మొదలవుతాయి. ఉదయం అల్పాహారం (పాలు, ఏపిల్) అనంతరం ఆయన వార్తాపత్రిక, కొన్ని ఆధ్యాత్మిక ప్రచురణలు చదువుతుంటారు. మధ్యాహ్న భోజనం మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. సలాడ్, పాలక్ తప్పనిసరి. 'వేపుళ్ళు గాని, బయటి ఆహారం గాని తినకపోవడం ద్వారా నేను ఆరోగ్యంగా ఉంటాను' అని ఆయన చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఆయన విక్టోరియా మెమోరియల్ వద్ద వ్యాహ్యాళికి సిద్ధమవుతారు. 'ఆయన ఎంత వేగంగా నడుస్తారంటే ఆయనను అందుకోవడానికి నేను పరుగు పెట్టవలసి వస్తుంది' అని ఆయన అనుంగు మిత్రుడు దుబే ఫిర్యాదు చేశారు.
Pages: 1 -2- News Posted: 15 January, 2010
|