నవ్వు ఓ దివ్యౌషధం న్యూఢిల్లీ : ఒక మనిషి తన డాక్టర్ వద్దకు వెళ్ళి తనకు ఆరోగ్యం బాగు లేదని చెప్పాడు. అప్పుడు డాక్టర్ మూడు సీసాలలో మాత్రలు రోగికి ఇచ్చాడు. ఆతరువాత డాక్టర్ అతనితో 'ఈ ఆకుపచ్చ మాత్రను నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నీటితో వేసుకో. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గ్లాసు నీటితో ఈ నీలి రంగు మాత్ర గుటుక్కుమనిపించు. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు నీటిలో ఈ ఎర్ర మాత్ర మింగేయ్' అని చెప్పాడు. ఆ వ్యక్తి భయంతో వణికిపోతూ 'నా రోగం ఏమిటి' అని అడిగాడు. అప్పుడు 'నువ్వు రోజూ తాగవలసినన్ని మంచినీళ్లు తాగడం లేదు' అని డాక్టర్ తాపీగా చెప్పారు.
ఈ పిట్టకథ మిమ్మల్ని నవ్వేట్లు చేసిందా? అలా అయితే మంచిదే. ఎందుకంటే ఏ మనిషైనా ఆరోగ్యంగా ఉండడానికి అనుసరించవలసిన ఉత్తమ మార్గాలలో నవ్వు ఒకటి. భావోద్వేగ వ్యక్తీకరణకు నవ్వు ఒక మార్గమని జాతీయ మానసిక వైద్య సంస్థ (ఎన్ఐపి)లో సైకియాట్రిస్ట్ డాక్టర్ నిఖిల్ రహేజా చెప్పారు.'మనిషి అంతఃస్థితికి ప్రతిబింబమే నవ్వు. మనిషి భావ వ్యక్తీకరణకు ముడిపడినది ఇది. నవ్వడం అనేది ఈ అంతఃస్థితికి పరాకాష్ఠ' అని ఆయన వివరించారు. హార్మోన్ల విడుదలతో నవ్వు జనిస్తుందని, ఇది శరీరంలో రసాయనిక ప్రతిచర్యలకు కారణమవుతుందని, ఆవిధంగా ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని డాక్టర్ రహేజా వివరించారు. 'రక్త ప్రసరణ పెరుగుతుంది. విశ్రాంతి తీసుకోగల స్థితికి శరీరం చేరుకుంటుంది' అని ఆయన చెప్పారు.
మనం నవ్వినప్పుడు మన శారీరక వ్యవస్థలో ఎండార్ఫిన్లు, ఎన్కెపాలిన్లు వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి మెదడు లోపల ఉండే హాయిగా ఉందనిపించే న్యూరో రసాయనాలు. మెదడు రెండు సెట్ల నాడులుగా విభజితమై ఉంటుంది. ఒకటి 'సింపథటిక్ సిస్టమ్' కాగా రెండవది 'పారాసింపథటిక్ సిస్టమ్'. ఇవి మనస్సును అంతఃశ్చేతనకు గురి చేస్తుంది. ఇది మనిషి అదుపులో లేనిది. ఈ నాడీ వ్యవస్థలో ఒక్కొక్కటి మనస్థితి, ప్రవర్తన, శరీరంపై ప్రభావం చూపే రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది హాని కలిగించవచ్చు లేదా పుష్టి కలిగించవచ్చు.
Pages: 1 -2- News Posted: 8 February, 2010
|