భాగ్యనగరిలో అద్దె గర్భాలు హైదరాబాద్ : పొత్తిళ్లలో పసిపాపను అపురూపంగా హత్తుకుంటున్న ఆ తల్లి(తండ్రా?) కంటి నిండా ఆనంద భాష్పాలు. అమెరికాలో స్వలింగ దాంపత్యం చేస్తున్న మిస్టర్ బ్రాడ్ ఫిస్టర్(29), మిస్టర్ మైకేల్ కలల రూపం ఆ పాప. ఫిస్టర్ రక్తాన్ని పంచుకుని, హైదరాబాద్ క్లీనిక్ లో ప్రాణం పోసుకుని, అద్దె తల్లి గర్భంలో పెరిగిన ఆడ శిశువుని తీసుకుని ఫిస్టర్ అమెరికాలోని కెంటకీ బయలుదేరాడు. తన 'సొంత' కూతురుని తీసుకుని ఆమెరికా వెళ్ళడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఫిస్టర్ తెగ మురిసిపోయాడు.
గత కొన్నేళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్న స్వలింగ సంపర్కులు ఫిస్టర్, మైకేల్ జంటకు కెంటకీలో కంప్యూటర్ సంస్థ ఉంది. వారు సంతానం కావాలని కోరుకున్నారు. దానిలో భాగంగానే హైదరబాద్ లో శిశువుకు జన్మనివ్వడానికి ఈ జంట అక్షరాల 60 వేల డాలర్లను అంటే భారత కరెన్సీలో దాదాపు 30 లక్షల రూపాయలను ఖర్చుపెట్టారు. అద్దె గర్భాల కోసం హైదరాబాద్ వచ్చే గే జంటల్లో ఇది మొదటిగా చెబుతున్నారు. హైదరాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం సహకరించిన మొదటి గే జంట కూడా ఫిస్టర్ అండ్ మైకేలే కావడం కూడా విశేషం. ఫిస్టర్ కుమార్తెకు ఆష్టన్ అని పేరు పెట్టారు.
గత యేడాది ఫిస్టర్ హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ తన వీర్యాన్ని భద్రపరిచాడు. భారతీయ మహిళ దానం చేసిన అండాన్ని ఫిస్టర్ వీర్య కణాలతో ఫలదీకరణ చేయించారు. అలా రూపొందిన పిండాన్ని గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్ లోని ఒక సంతాన సాఫల్య కేంద్రంలోనే జరిగింది. ఇద్దరు తండ్రులకు ఒక శిశువును ఇవ్వడం ఈ కేంద్రానికి ఇదే తొలిసారి.
Pages: 1 -2- News Posted: 19 February, 2010
|