పెళ్ళాం ఉన్నా 'నెట్' మిన్నా? లండన్ : భార్యాభర్తలు బెడ్ రూమ్ లో ఉంటే ఏం చేస్తారు? ఇంకేముంది సరస శృంగార సముద్రంలో ఈదులాడుతూ ఉంటారని, మునిగితేలుతూ ఉంటారని అనుకోవడం సహజం. కానీ అలా అనుకుంటే ఇక పొరపాటే. బెడ్ రూమ్ కథలు ఇప్పుడు మారుతున్నాయి. బెడ్ రూమ్ లో ఇప్పుడు భార్య స్థానాన్ని నెట్ భూతం అక్రమిస్తోంది. అందాలొలికిస్తూ మురిపించే ముద్దు గుమ్మ లాంటి భార్య పక్కలో ఉన్నా... గురుడు మనసు మాత్రం నెట్ పైనే ఉంటోంది.. భర్తతో కలసి కాస్త సరదా పడదామని భార్యామణీ ఆశ పడి పక్కనే కూర్చున్నా గురుడి చేతులు మాత్రం నెట్ బ్రౌజింగ్ చేయడంపైనే. కబుర్లు చెబుతూ కాలక్షేపం చేద్దామని, సొగసుగత్తె సతీమణి మాట కలిపినా, శ్రీవారి మాత్రం మొబైల్ లో మెయిల్ చెక్ చేసే పని లోనే ఉంటున్నారు. భార్యతో కలసి సరసమాడాల్సిన భర్త సోషల్ నెట్ వర్క్ లో సొల్లు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు. బెడ్ రూమ్ లో భార్యను అల్లుకోపోవాల్సిన భర్త నెట్ 'వలలో పడి' గిలగిలా తన్నుకుంటున్నాడు. అవును ఇప్పటి కుర్రోళ్ళంతా బెడ్ రూమ్ లో చేసే పని ఇదేనని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది.
18 నుండి 44 ఏళ్లలోపు ఉన్న యువతలో 80 శాతం మంది బెడ్ రూమ్ ల్లో సరసాలకు బదులుగా చేస్తున్న పనులివే. బెడ్ రూమ్ లో భార్య స్థానాన్ని నెట్ కిచ్చేసాడు. భార్యభర్తలు బెడ్ రూమ్ లో ఉంటే శృంగార సరసాల్లో మునిగితేలుతుంటారన్న భావనను పటాపంచలు చేస్తూ ఇంటర్నెట్ తోనే శ్రీవారి కాపురం సాగుతోంది.బెడ్ రూమ్ లో బిజీగా ఎదో చేస్తున్నాడని అంతా అనుకున్నా చివరకు ఏమీ చేయడం లేదని తేలింది. 80 శాతం యువత బెడ్ రూమ్ లో ఇంటర్నెట్ కే సమయం కేటాయిస్తున్నట్లు ఓ సర్వే తేటతెల్లమైంది. యూకేకి చెందిన స్పార్కలర్ ఫర్ మైక్రోసాఫ్ట్ అనే అడ్వర్టయిజింగ్ అనే సంస్థ యూకెలో ఇటీవల సర్వే చేసింది.
Pages: 1 -2- News Posted: 24 February, 2010
|