కొడుకును చంపేసిన తల్లి కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా) : లావెండర్ హిల్ ప్రాంతాన్ని అంధకారం క్రమంగా ఆక్రమిస్తోంది. అంటే చట్టానికి బద్ధులైనవారు ఇళ్ళలో దాక్కోవలసిన సమయం వచ్చిందన్నమాట. కేప్ టౌన్ కు సరిగ్గా 20 నిమిషాల ప్రయాణ దూరంలోని హౌసింగ్ ఎస్టేట్స్ 'కేప్ ఫ్లాట్స్'లో మాదకద్రవ్యాల ముఠాలు వీధుల్లో స్వైరవిహారం సాగిస్తుంటాయి. నగరంలోని హింసాత్మక నేరాలలో 80 శాతం మాదకద్రవ్యాల ప్రభావంతో జరిగేవేనని పోలీస్ విభాగం అధిపతి రాబ్ యంగ్ చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రతి 25 నిమిషాలకు ఒక హత్య జరుగుతుంటుంది.
మాదకద్రవ్యాల అలవాటు ఎంతగా పెచ్చుమీరిపోయిందంటే తల్లిదండ్రులు ఎంతకైనా తెగించవలసి వస్తున్నది. 52 సంవత్సరాల ఎల్లెన్ పక్కీస్ విషయంలో ఆమె మాదకద్రవ్యం మత్తులో దుర్మార్గాలకు తెగబడిన తన కన్న బిడ్డనే హతమార్చవలసి వచ్చింది. మాదకద్రవ్యాలకు బానిస అయిన అబ్బీ పక్కీస్ ఏడేళ్ల పాటు లావెండర్ హిల్ లో తన తల్లి ఇంటిలో ఆమెను దోపిడీ చేయడమే కాకుండా రకరకాలుగా బెదరిస్తుండేవాడు. అతను లోపలికి రాకుండా చూసేందుకు ఆమె తన ఇంటికి ఇనుప కడ్డీలతో కవచం ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. అతనిని చంపడం అంటే తన ప్రాణాలను తానే తీసుకోవడమేనని ఆమె చెప్పిది. దక్షిణాఫ్రికాలో మాదకద్రవ్యాల బెడద ఎంతగా ముదిరిపోయిందో ఆమె చర్యే సూచిస్తున్నది.
ఆమె కుమారుడు 11 ఏళ్ల వయస్సులో దగ్గా (మారిజువానాకు స్థానిక పేరు) పీల్చడం ప్రారంభించాడు. 14 ఏళ్లు వచ్చేసరికి అతను స్కూలు చదువుకు స్వస్తి చెప్పి, కొత్త మాదకద్రవ్యం 'మెథాంఫెటమైన్'కు అలవాటు పడ్డాడు. దీనిని పాశ్చాత్య దేశాలలో 'క్రిస్టల్ మెథ్'గాను, దక్షిణాఫ్రికాలో 'టిక్'గాను పేర్కొంటుంటారు. ఇది కేప్ టౌన్ పాలిట శనిలా తయారైంది.
Pages: 1 -2- News Posted: 1 March, 2010
|