అంతా ముగిసింది: ఎంఎఫ్
దోహా : సుప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా (ఎంఎఫ్) హుస్సేన్ భారతీయుడుగా ఇక ఎంత మాత్రం కొనసాగరు. 'అధ్యాయం ముగిసింది. తుది లాంఛనాలను పూర్తి చేశాను' అని ఆయన ఖతార్ రాజధాని దోహాలోని ఇమ్మిగ్రేషన్ శాఖలో ఆవేదనాభరితుడైన ఒక భారతీయ అభిమానితో చెప్పారు. 95 సంవత్సరాల వయస్సున్న, పాదరక్షలు ధరించని హుస్సేన్ పెయింట్ బ్రష్ ఆకారంలోని ఊతకర్రను పట్టుకుని జనంతో కూర్చుని మారుతున్న కౌంటర్ నంబర్లు చూస్తున్నప్పటికీ ఆయనలోని మానసిక వేదన కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది.
'క్షమాపణతో పరిస్థితులు చక్కబడి ఉండేవా' అనే ప్రశ్నకు 'ఎంత కాలం నేను వేచి ఉండగలను. ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచాయి. సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది' అని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, భారతదేశంతో తన సంబంధాలు ఎంతో దృఢమైనవవి, అవి అంత తొందరగా అంతం కావని ఆయన వివరించారు. 'నా చిత్రాలకు ఇప్పటికీ ఇండియాయే ఆధారం. అది నా నరనరాల్లో ప్రవహిస్తుంటుంది. నేను ఇప్పటికీ దానినే ఆధారం చేసుకుంటుంటాను' అని హుస్సేన్ చెప్పారు.
హిందూ దేవతలను నగ్నంగా చిత్రించినందుకు కొన్ని ఛాందసవాద సంస్థలు తనపై తీవ్రంగా ధ్వజమెత్తిన తరువాత 2006లో హుస్సేన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన చిత్రాలను ధ్వంసం చేశారు. ఆయనపై సుమారు 900 కేసులు దాఖలయ్యాయి. తనకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయకపోవడంతో ఆయన దుబాయికి వెళ్లిపోయారు.
Pages: 1 -2- News Posted: 2 March, 2010
|