వేటాడిన ఒంటరితనం కోలకతా : ఒంటరితనం వేధించింది. వెంటాడింది. ఆఖరికి వేటాడింది. దక్షిణ కోలకతాలోని ఆ వృద్ధ దంపతులకు తమ ఏకైక కుమారుడు బెంగళూరులో ఉద్యోగంలో చేరిన తరువాత ఒంటరితనం భరించలేకపోయారు. వారికి 'జీవితేచ్ఛ నశించింది'. ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తు పరస్పరం దూరమయ్యారు. భర్త ప్రాణాలతో మిగిలిపోయాడు.
64 సంవత్సరాల మనోరంజన్ సర్కార్, 56 సంవత్సరాల శిఖా సర్కార్ తాము ఎంత 'ఒంటరితనం' అనుభవిస్తున్నామో బాధను వ్యక్తం చేస్తూ 12 పేజీల ఆత్మహత్య లేఖ రాశారు. తమ 'అంత్యక్రియల' కోసం వారు 4000 రూపాయలను ప్రత్యేకించారు. తమ 22 సంవత్సరాల ఇంజనీర్ కుమారుడు దేవ్ జ్యోతి ఇష్టపడినట్లయితే తమ మృతదేహాల నుంచి అవయవాల దానం కోసం ఆ డబ్బును ఉపయోగించవచ్చునని కూడా వారు తమ లేఖలో సూచించారు.
వారిద్దరు ఆతరువాత నిద్ర మాత్రలు మింగారు. వారు పరిమితికి మించి నిద్ర మాత్రలు వేసుకుని ఉండాలని వైద్యులు అనుమానిస్తున్నారు. గురువారం ఉదయం వారిని పలకరించడానికై పాటూలి సమీపంలో ఛత్తీస్ గఢ్ హౌసింగ్ కాంప్లెక్స్ లో భాగమైన సదరన్ గార్డెన్ అపార్ట్ మెంట్స్ కు వెళ్లిన కొందరు బంధువులు మెయిన్ డోర్ పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా శిఖ విగతజీవిగా కనిపించింది. తమ ఫోన్ కాల్స్ కు స్పందన లేకపోయేసరికి ఏదో జరిగి ఉంటుందని బంధువులు అనుమానించారని కుటుంబ సన్నిహితులు ఒకరు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 5 March, 2010
|