వేధించే కోడళ్లు! ముంబై : భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి) 498 ఎ సెక్షన్ కింద భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన కేసులో నుంచి ఒక వ్యక్తికి, వృద్ధులైన అతని తల్లిదండ్రులకు ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల విముక్తి కలిగించింది. తన పట్ల క్రూరంగా ప్రవర్తించారని, వరకట్నం కోసం తనను వేధించారని ఆరోపించిన యువ గృహిణి వాటిని నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొన్నది.
ఇది న్యాయవాదులకు ఊకదంపుడు వంటి కేసు విచారణే. కాని దుర్భాషలాడినట్లు, వేధించినట్లు ఆరోపణలకు గురైన అత్తగారికి మాత్రం నిర్దోషిగా విడుదల కావడం ఎంతైనా ఊరట కలిగించే విషయమే. తనకు ఇది 'ఒక పీడకల వంటిది' అని 62 ఏళ్ల మహిళ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపిసి 498ఎ సెక్షన్ కింద తమ కోడళ్ళు లేదా మరదళ్ళు క్రిమినల్ కేసు పెట్టిన తరువాత మనో వ్యథకు గురైన, న్యాయవ్యవస్థ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన అనేక మందిలో ఆమె కూడా ఉన్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సిఆర్ బి) సమాచారం ప్రకారం 2004, 2007 మధ్య కాలంలో 498ఎ సెక్షన్ కింద నేరానికి లక్షా ఇరవై వేల మంది మహిళలు అరెస్టయ్యారు. ఇది పైశాచిక సెక్షన్ అని అనేక మంది పురుషులు పేర్కొంటుంటారు. కాని నిస్సహాయులైన భార్యలను వరకట్నం కోసం వేధింపులకు, చిత్రహింసలకు గురి కాకుండా తప్పించడం ఈ సెక్షన్ లక్ష్యం.
సెక్షన్ 498ఎ దుర్వినియోగం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొంత మంది మహిళలు, పురుషులు 'మదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హజ్బెండ్స్ ఎగైనిస్ట్ అబ్యూజ్ ఆఫ్ లా' (ఎంఎఎస్ హెచ్ ఎఎఎల్ - మషాల్) పేరిట ఒక బృందంగా ఏర్పడ్డారు. 'ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్' (ఐఎఫ్ఎఫ్) అనే స్థానిక ఎన్ జిఒలో భాగమే ఈ బృందం. ఈ చట్టం దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ సంస్థ ధ్యేయం.
Pages: 1 -2- News Posted: 8 March, 2010
|