ఏ పార్టీకి, ఎన్ని నిధులు?
న్యూఢిల్లీ: ఈ పర్యాయం ప్రధాన రాజకీయ పార్టీలు తమ నిధుల కోసం ఏ సంస్థలపై ఆధారపడుతున్నాయి? పార్టీలకు ఎన్నికల కోసం అందే విరాళాలలో అధిక భాగం నల్ల ధనమేననే సంగతి విదితమే. కాని ఇటీవలి కాలంలో పార్టీలకు నిధులు సమకూరుస్తున్నప్రముఖ భారతీయ కార్పోట్ సంస్థల గురించి నిశితంగా పరిశీలిస్తే ఎవరు, ఎవరికి, ఎంత మేరకు నిధులు సమకూరుస్తున్నారో విదితం కాగలదు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన విరాళాలను బట్టి చూస్తే ఏ కార్పొరేట్ కంపెనీలు ఏ పార్టీని భుజానికి ఎత్తుకున్నాయో కూడా స్పష్టం కాగలదు.
అయితే, ఈ కంపెనీలలో కొన్ని మాత్రం విరాళాలు ఇచ్చే విషయంలో తమ రాజకీయ అభిమతం వెల్లడి కాకుండా జాగ్రత్తలు పాటించాయి. ఇలాంటి కంపెనీలు దేశంలోని ప్రధాన పార్టీలన్నింటికి తమ విరాళాలను దాదాపుగా సమానంగా పంచాయి. విరాళాల వితరణ విషయంలో మరికొన్ని కంపెనీలు గత ఎన్నికలలో ఒక్కొక్క ప్రధాన పార్టీ సంపాదించిన వోట్లు లేదా సీట్ల శాతాన్ని బట్టి వారు విరాళాలు పంపిణీ చేశాయి.
కాంగ్రెస్ కు ప్రధానంగా ఆదిత్య బిర్లా గ్రూపు, టాటా గ్రూపుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి అనిల్ అగర్వాల్ కు చెందిన స్టెర్లైట్ గ్రూప్, గుజరాత్ కేంద్రంగా గల అదానీ గ్రూపుల నుంచి గణనీయంగా విరాళాలు అందాయి. వీడియోకాన్ సంస్థ అధిపతులు ధూత్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ తోపాటు బిజెపికి, మహారాష్ట్రలో శివసేనకు విరాళాలు అందజేస్తున్నారు.
Pages: 1 -2- -3- -4- -5- News Posted: 5 March, 2009
|