నిజానికి ఇది ఆచరణ సాధ్యమా అని మనకి మనం ప్రశ్నించుకుంటే...మన దేశంలో అయితే ఇది కొంచెం కష్టంతో కూడుకుని ఉన్న సమస్యే...నిశితంగా పరిశీలిస్తే ఇందులో ఉండే లాభనష్టాలను మనం బేరీజువేయవచ్చు....
లాభాలు :
* ఇద్దరూ..ఆదర్శ భావాలు కలవారైతే...ఇద్దరి మాట...తీరు ఒక్కటిగా ఉన్నట్లయితే...అటువంటి వారు ఒకరి అభిప్రాయాన్ని వేరొకరు గౌరవిస్తారు.
* ఇద్దరికీ కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. వీళ్లిద్దరూ విడిపోవడానికి ప్రత్యేకించి ఏ కోర్టూ అవసరం ఉండదు...వీళ్ల హార్టే వీళ్లకి కోర్టు....
* ఇద్దరూ వాళ్ల..వాళ్ల మనసుకి నచ్చిన పనులు చేయొచ్చు...ఏ పార్టీకైనా వెళ్లొచ్చు...డిస్కోథెక్ లకు..క్లబ్లు పబ్లకు తిరగొచ్చు...రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావచ్చు. ఇద్దరూ తెల్లారాక మళ్లీ ఫ్రెండ్స్ లా మాట్లాడుకోవచ్చు...
* ఆర్థిక స్వాతంత్య్రం కావలసినంత ఉంటుంది. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు..ఎవరెంత దేనికి ఖర్చుపెడుతున్నారో...ఇద్దరికీ అవసరం ఉండకపోవచ్చు. సేవింగ్ చేయొచ్చు...లేకుంటే విచ్ఛలవిడిగా ఖర్చుపెట్టవచ్చు...
* ఒకరికోసం మరొకరు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఇంట్లో ఉంటే ఒకరికొకరు ఇంటిపనులు సమానంగా సర్థుబాటుచేసుకోవచ్చు. ఇద్దరిలో ఎవరికి ఒంట్లో బాగోలేక పోయినా...ఒకరికి తోడుగా ఇంకొకరు పనులు సర్థుబాటుచేసుకోవచ్చు.