నష్టాలు...
* సమాజం వీళ్లను అస్సలు పట్టించుకోదు. వీళ్లకు సహాయ సహకారాలు ఎదుటివారినుంచి...ఇరుగుపొరుగు నుంచి లభ్యం కావు.
* భవిష్యత్తులో వీళ్లకు పుట్టే బిడ్డలు కూడా గౌరవంగా బతికే అవకాశం లేదు.
* ఇద్దరికీ...వాళ్ల వాళ్ల పెద్దల నుండి ఏమాత్రం సహకారం లభించే అవకాశం లేదు.
* మితిమీరిన స్వేచ్ఛతో ఇద్దరూ...ఇగోలకు పోయి ఎక్కువకాలం కలిసివుండలేక పోవచ్చును.
* విడిపోయాక...ఇద్దరిలో ముఖ్యంగా ఆమెను పెళ్లాడటానికి...వేరొకరు ముందుకు రాకపోవచ్చును. ఒకవేళ డబ్బుకోసం ఆమెను పెళ్లాడినా...భవిష్యత్తులో ఆమె నరకం చవిచూడాల్సివస్తుంది...ఎందుకంటే వచ్చిన భర్త శాడిస్టులా ఆమె జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేస్తూ...ఆమెను చిత్రవధకు గురిచేయవచ్చు.
* మగవారి విషయంలో కూడా వివాహానికి ముందు వేరొకరితో డేటింగ్ చేశాక...ఆ తర్వాత ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాక...ఆమె సహకారం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఒక వేళ ఇతని సంగతి తెలిసే ఆమె పెళ్లాడినా...ఆమెకు పదే పదే అతని గతం తలుచుకుని...వర్తమాన సంసారాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. ఆమె సుఖంగా ఉండక...అతనిని కూడా సూటిపోటి మాటలతో రెచ్చగొట్టవచ్చు...
* సంప్రదాయక దేశాలలో ఈ విధానాన్ని హర్షించరు. అలా విడిపోయిన జంటలకు పుట్టిన పిల్లలకు ఎటువంటి హక్కులు విధులు చట్టపరంగా వర్తించవు. తర్వాత వీరి స్కూల్ రికార్డులలో తండ్రి ఎవరో గుర్తించాల్సివుంటుంది. అలాంటప్పుడు వీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుంది.
ఇలా లాభనష్టాలను బేరీజువేసుకుంటే ఇందులో ఉండే ప్రయోజనం కన్నా కూడా వారి సంతానానికి ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంది.