నిరాశ,నిస్పృహల్లో టెక్కీలు
హైదరాబాద్:హాయిగా,ఉల్లాసంగా సాగే సాఫ్ట్ వేర్ తీపి జీవితాల్లోకి ఒక్కసారిగా లేఆఫ్ లు ప్రవేశించేసరికి టెక్కీలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏ కంపెనీ ఎప్పుడు దివాళా తీస్తుందో అర్ధంకాని అనిశ్చితి సర్వత్రా వ్యాపించడంతో వారిని భయం వెంటాడుతోంది. అజేయమనుకున్న అమెరికా కార్పొరేట్ దిగ్గజాలు సైతం పేక మేడల్లా కప్పకూలిపోయి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది సాఫ్ట్ వేర్ నిపుణులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రోజుకొక కంపెనీ లేఆఫ్ ప్రకటించిన వార్తలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి.దాంతో జంటనగరాల్లోని టెక్కీలు, బిపిఓ నిపుణులు దుఖసాగరంలో మునిగిపోయారు.దాంతో 2008 డిసెంబర్ నుండి మానసిక వైద్య నిపుణులను కలిసే వారి సంఖ్య రోజురోజుకు పెరగసాగింది.ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, విసుగుదల, చిన్నవిషయాలపై కోపం రావడం, కలుపుగోలుగా మాట్లాడలేకపోవడం,ఏకాంతంలో గడపడం, ఒంటరిగా ఉండటం లాంటి పలు సమస్యలతో వారు సతమతమవుతున్నారు. ఇవన్నీ అబివృద్ధి చెందిన దేశాల్లల 1930ల నాటి మహా సంక్షోభం తాలూకు సామాజిక రుగ్మతలే.అభివృద్ధి చెందిన దేశాల ఆర్దిక సంక్షోభంతో పాటు దాని తాలూకా సామాజిక, సాంస్కృతిక, జీవనశైలికి సంబంధించిన రుగ్మతలు కూడా క్రమంగా మన దేశంలోకి ప్రవేశించనట్లే లెక్క.
పాశ్చాత్య ఆధునికతతోపాటు పాశ్చాత్య జీవనశైలిని కూడా ఆహ్వానించడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో అమెరికా లో వెర్రితలలు వేసిన 'హైపర్ ఇండివిడ్యులిజం'(మాహా వ్యక్తివాదాన్ని) సైతం వీరు ఆబగా తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. అమెరికాకు ఆర్తిక వ్యవస్థకు అనుబంధంగా బతికే సాఫ్ట్ వేర్ సర్వీసు రంగానికి వెన్నెముక లేదు. అమెరికా ఆర్దిక వ్యవస్థ వికాసంలో ఉన్నంత కాలం లక్షలాది రూపాయల జీతాలతో లేనిపోని అలవాట్లకు, పాశ్చాత్య జీవన శైలికి ఈ టెక్కీ కుర్రకారు అలవాటు పడ్డారు.అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడంతో మన సాఫ్ట్ వేర్ రంగం కూడా కుదేలయ్యింది. కోట్లాది మందికి ఉపాధి కల్పించే సాప్ట్ వేర్ రంగంల సంక్షోభంలోకి కూరుకుపోయింది. ప్రతిదానిక అమెరికాని మోడల్ గా చూసే సాఫ్ట్ వేర్ కుర్రాళ్లకు అమెరికా ఆర్ధిక సంక్షోభం మింగుడుపడలేదు. దాంతో వారు తీవ్ర మానసిక సంక్షోభంలోకి జారిపోయారు. టెక్కీల మానసిక పరిస్థితి బాధాకరంగా మారింది. కోపం, తృణీకరణ, దిగులు-విచారం, అభద్రతల్లాంటి మనోవికారాలు వారిలో చోటు చేసుకున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఒక్క జంటనగరాల్లోనే దాదాపు 2 లక్షల మంది సాఫ్ట్ వేర్, బిపిఓ నిపుణులున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 10 February, 2009
|