నిరాశ,నిస్పృహల్లో టెక్కీలు
ఒకప్పుడు ఐఏఎస్, ఐపిఎస్ అదికారులు సమాజాని కంటే అతీతంగా ఊహించుకుంటున్న పరిస్థితి గత నాలగైదేళ్లుగా సాఫ్ట్ వేర్ నిపుణుల వంతయ్యింది. సమాజంలో తమకు తాము ఒక కులీన వర్గంగా, అతీతులుగా, ప్రత్యేక మేధావి వర్గంగా, ఆధునికతకు తామే ప్రతినిధులుగా ఊహించుకోవడం జరిగేది. 'డాలర్' లెక్కల్లో అందుకునే రూపాయల కైపుతో ఈ సాప్ట్ వేర్ కుర్రాళ్లు పబ్ లు,డిస్కోథెక్ లు,లేట్ నైట్ పార్టీలతో సమాజం నుండి దూరంగా గడిపారు. వేషభాషలతో సహా సమాజంలో ఇతరుల విషయాలకు దూరంగా ఒంటరి ప్రత్యేక సమూహంగా గడపడం వారిలో ఆత్మాశ్రయతకు కారణమైంది.తానున్న సమాజంలో భాగంగా తమ్ముతాము పునరావిష్కరించుకుంటేనే గాని వారి మానసిక ఒత్తిడికి పరిష్కారం దొరకదు. సమాజం నియమాల పట్ల స్పృహ, ఆర్ధిక సంక్షోభం, సామాజిక సంభక్షోభం ల్లాంటి విషయాలపట్ల చారిత్రక అవగాహనను పెంపొందించుకుని, అందుకు తగినట్లు జీవనశైలిని అలవరచు కోవడం చాలా ముఖ్యం.టెకీల మానసిక ఆందోళనకు వారి సామాజిక ఒంటరితనం,సమాజానికి అతీతులుగా భావిస్తూ సామాజిక అంశాలను, సమస్యలను వాస్తవ దృష్టి చూడకుండా, పట్టించుకోకుండా ఏకాకితనాన్ని అలవరచుకోవడం నుండి వారు బయటపడాలి.అమెరికా అంటించిన 'హైపర్ ఇండివిడ్యవలిజమ్'విష కౌగిలి నుండి బయటపడి స్తానిక సమిష్టితత్వాన్ని అలవరచుకోకపోతే భారతీయ టెక్కీల మానసిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది.
Pages: -1- -2- 3 News Posted: 10 February, 2009
|