నిరాశ,నిస్పృహల్లో టెక్కీలు
'టెక్కీలు చాలా మానసిక ఉద్రిక్తతలో ఉన్నారు. ఈ దిగులును వైద్య పరిభాషలో యాంటిసివేటరీ డిప్రషన్ అని పిలుస్తాము. కంపెనీల ఎవరికైనా పింక్ స్లిప్ వచ్చిందంటే, అతని సహఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తమ భవిష్యత్ పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.భారత దేశంలో అంత ఘోరమైన పరిస్థితులు నెలకొనలేదన్న విషయం వారు అర్ధం చేసుకోవాలి.'అని ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకియాట్రీ (ఐఏపిపి) డాక్టర్ జి ప్రసాద రావు తెలిపారు. సత్యం అకౌంటింగ్ కుంభకోణం బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తున్న టెక్కీల పరిస్థితిని మరింతగా దిగజార్చింది.'సత్యం ప్రహసనం జరిగినప్పటి నుండి బహుళజాతి సంస్థల్లో పనిచేసే టెక్కీలు చాలా దెబ్బతిన్నారు.వీరిలోదాదాపు 80 నుండి 85 శాతం మంది సైక్రియాటిస్టుల వద్ద చికిత్స పొందుతున్నారు'అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు.
టేక్కీలు భారీగా జీతాలు తీసుకుంటున్నపుడు వాయిదాల పద్దతిన కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్లు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వగైరాలకు చెల్లించవలసిన నెలసరి వాయిదాలు వారిని విపరీతంగా బాధిస్తున్నాయి. వారిలో కొంత మంది పలు వస్తువులను కొనుగోలు చేయాలనుకున్న ప్రణాళికల పట్ల వారిలో భయాందోళనలు కూడా నెలకొన్నాయి. వారిలో నెలకొన్న, దిగులు-విచారం వారిని వారి కుటుంబాల నుండి దూరం చేసి ఏకాకిగా మారుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి దిగులు విచారాలనుండైనా వ్యక్తులను బయటకు తీసుకరావచ్చు. అయితే అందుకు కొన్ని పద్ధతులను అనుసరిస్తే విజయంవంతంగా సంక్షోభం నుండి బయటబపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.మానసిక సంక్షోభంలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఉద్వేగ భరితమైన, శారీరకమైన ప్రేమ చాలా అవసరం. మనోవికారాలను నియంత్రించే యోగా లాంటి వ్యాయామం చాలా అవసరం. ఇవి తాత్కాలికమైన చిట్కాలు మాత్రమే, పరిపూర్ణమైన పరిష్కారం భవిష్యత్ నిర్ణయిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 10 February, 2009
|