ప్రేమలో పడేసే మాత్ర!
న్యూయార్క్ : ప్రేమలో పడాలనుకుంటున్నారా? అలా అయితే, ఒక ప్రేమ మాత్ర వేసుకోండి. అంతే అమాంతం మీరు ప్రేమికులైపోతారు. వచ్చే సంవత్సరం 'వాలెంటైన్స్ డే' కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే, ప్రేమంటే ఏ కారణంగానైనా వెగటు పుట్టిందా? ప్రేమను చంపే మాత్ర వేసుకోండి. తక్షణం ఆ భావాలన్నీ హరించుకుపోతాయి.
ఒక బస్సు ఎక్కి రెండు స్టాప్ ల తరువాత దిగిపోయినట్లుగానే మనం కోరుకున్నప్పుడు ప్రేమలో పడడం, వద్దనుకున్నప్పుడు ప్రేమను వదలుకోవడం ఇప్పుడు సాధ్యమేనని వైజ్ఞానికులు అంటున్నారు. ప్రేమలో పడడమనేది మనిషి మెదడులో జరిగే రసాయనికి ప్రతిచర్య మాత్రమేనని వారు చెబుతున్నారు. జనం ప్రేమలో పడేట్లుగా ఈ రసాయనిక ప్రతిచర్యను ప్రేరేపించేందుకు త్వరలో ఒక ప్రేమ మాత్రను కనుగొనవచ్చునని వారు సూచిస్తున్నారు. అదే విధంగా జనం ప్రేమలో నుంచి బయటపడడానికి ప్రేమ నిరోధక మాత్రను కూడా కనుగొనవచ్చునని వారంటున్నారు.
జనం ప్రేమలో పడేందుకు, ఆ ప్రేమలో నుంచి బయటపడేందుకు గాను సరైన రసాయన మిశ్రమాన్ని పరిశోధకులు త్వరలోనే కనుగొనవచ్చునని అమెరికన్ న్యూరో-సైంటిస్ట్ ఒకరు సూచించారు. అట్లాంటాలోని ఎమరీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన లారీ యంగ్ గత వారాంతంలో ఒక టెలివిజన్ నెట్ వర్క్ తో మాట్లాడుతూ, ప్రేమ వంటి భావోద్వేగాలకు మనిషి మెదడులో జీవరసాయన (బయోకెమికల్) చర్యలే కారణమని పరిశోధకులు త్వరలో నిరూపించగలరని చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 16 February, 2009
|