ప్రేమలో పడేసే మాత్ర!
వోల్ అనుబంధాన్ని ప్రేరేపించే మెదడులోని భాగాలు, మానవ ప్రేమకు సంబంధించిన మెదడులోని భాగాలు ఒకేరీతిలో ఉన్నట్లు తన పరిశోధనలో వెల్లడి కావడం శుభవార్త అని యంగ్ పేర్కొన్నారు. 'అంతేకాదు. వోల్స్ లో అనుబంధాన్ని పురికొల్పుతున్నట్లుగా గమనించిన రసాయనం ఆక్సిటోసిన్ మనిషి ప్రవర్తనను కూడా మారుస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.
'ఆక్సిటోసిన్ ను పీల్చేవారు మరింత నమ్మకస్థులుగా మారతారు... వారు చూపులో చూపు కలుపుతారు... అది వారిని సమాజానికి అనుగుణంగా వారిని మారుస్తుంది. డోపామైన్ మనకు రివార్డ్ ఇస్తుంది. అందువల్ల అంతా మంచిగా ఉందని అనిపిస్తుంది' అని ఆయన పేర్కొన్నారు. ప్రేమ మాత్ర రూపేణా ఈ రెండు రసాయనాలు (ఆక్సిటోసిన్, డోపామైన్) మిశ్రమాన్ని తయారుచేస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ ఏర్పడగలదని యంగ్ సూచించారు.ఆకర్షణను రసాయనాలతో కలిగించినప్పుడు, ప్రేమ నిరోధక మాత్రలతో ఆ ఆకర్షణ పోయేట్లు చేయడం సాధ్యమే అవుతుందని యంగ్ అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 16 February, 2009
|