ప్రేమలో పడేసే మాత్ర!
అమెరికా, కెనడాలలో 'ప్రెయిరీ'లలో (సారవంతమైన మైదానాలలో) కనిపించే పొట్టితోక గల ఎలుక వంటి జంతువులు 'ప్రెయిరీ వోల్స్'పై తాను జరిపిన పరిశోధన వల్ల మెదడులో కొన్ని రకాల రసాయనాల చేర్పు లేదా తొలగింపు వల్ల లైంగికానుబంధాన్ని ప్రేరేపించడం లేదా దానిని అడ్డుకోవడం వంటివి చేయవచ్చునని తేలినట్లు ఆయన తెలిపారు.
'వోల్స్ ఒకే భాగస్వామిని కలిగి ఉంటాయి. అంటే, ఒకే భాగస్వామితో జీవితాంతం కలసి ఉంటాయన్నమాట. దీని వెనుక కెమిస్ట్రీ ఏమిటా అని మేము అధ్యయనం చేస్తున్నాం' అని యంగ్ చెప్పారు. యంగ్ ఆడ ప్రెయిరీ వోల్ మెదడులోకి ఆక్సిటోసిన్ అనే రసాయనం (హార్మోన్)ను ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఒకే భాగస్వామిని కలిగి ఉండడమనే సిద్ధాంతానికి వెంటనే స్వస్తి చెప్పి సమీపంలోని మరొక మగ వోల్ వెంట పడింది. అయితే, దాని మెదడులోకి ఆ హార్మోన్ ను పంపడం నిలిపివేసినప్పుడు కొత్త మగ భాగస్వామితో దాని అనుబంధం కూడా ముగిసింది.
'ఈ హార్మోన్ న్యూరోట్రాన్స్ మిటర్ డోపామైన్ ప్రేరేపించే ప్రతిఫలం (రివార్డ్), పునరుత్తేజం (రీ ఇన్ ఫోర్స్ మెంట్) సిస్టమ్ తో కలసి పని చేస్తుంది. నికోటిన్, కొకెయిన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు మనుష్యులలో అత్యుత్సాహాన్ని, అలవాటు కలిగించేందుకు ఉపయోగించుకునే సర్క్యూటే దీనికీ ఉపయోగపడుతుంది' అని యంగ్ వివరించారు.
Pages: -1- 2 -3- News Posted: 16 February, 2009
|