ప్రియురాలి ప్రతీకారం!
షాంఘై: ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో తన ఐదుగురు ప్రియురాళ్ళను పోషించడం కష్టంగా భావించిన ఒక చైనీస్ సంపన్న వాణిజ్యవేత్త వారిలో ఎవరిని అట్టిపెట్టుకోవాలో తేల్చుకోవడానికి వారి మధ్య ఒక పోటీ నిర్వహించినట్లు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. అయితే, ఈ పోటీ చివరకు విషాదకర మలుపు తిరిగింది. తన చూపుల ఆధారంగా పోటీలో ఓడిపోయిన ఒక ప్రియురాలు ఆగ్రహం పట్టలేక ఆయనను, మిగిలిన నలుగురు మహిళలను ఒక కారులో ఎక్కించుకుని తానే నడుపుతూ ఒక పర్వత మార్గంల నుంచి వాహనాన్ని పల్టీ కొట్టించినట్లు 'షాంఘై డైలీ' పత్రిక తెలియజేసింది.
డిసెంబర్ 6న జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె మరణించగా తీవ్ర గాయాలపాలైన బిజినెస్ టైకూన్ ను మిగిలిన నలుగురు ప్రియురాళ్ళను ఆసుపత్రిలో చేర్పించారని పత్రిక తెలిపింది. మొదట్లో దీనిని ప్రమాదంగా భావించారు. కాని మృతురాలు రాసిన ఒక లేఖ ద్వారా ఈ విడ్డూరపు పోటీ గురించి వివరాలు వెల్లడైనట్లు పత్రిక తెలిపింది. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలని, ఆమె ఇంటిపేరు యూ అని తెలిసింది.
Pages: 1 -2- -3- News Posted: 18 February, 2009
|