ప్రియురాలి ప్రతీకారం!
మొదటి రౌండు అందాల పోటీలో యూ ఓడిపోయింది. లియూ అనే ఇంటిపేరు గల మహిళ మద్యపాన రౌండ్ తోపాటు అన్ని రౌండ్లలో ఆధిపత్యం సాధించి పోటీలో గెలిచింది. యూను ప్రియురాలి కొలువు నుంచి తొలగిస్తున్నట్లు, ఆమె అపార్ట్ మెంట్ ను కూడా అమ్మేస్తున్నట్లు ఫాన్ ఆమెకు తెలియజేసినప్పుడు చివరిసారిగా అందరం కలసి బయటకు వెళదామని ఆమె చేసిన ప్రతిపాదనకు ఫాన్ అంగీకరించాడు. అలా కారులో బైటకు వెళ్ళినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని యూ నిశ్చయించుకున్నది.
ప్రమాదం అనంతరం యూ తల్లిదండ్రులకు ఆమె మృతికి నష్టపరిహారంగా ఫాన్ 5,80,000 యువాన్లు (దాదాపు రూ. 42 లక్షలు) చెల్లించాడు. అతని వ్యవహారాల గురించి తెలుసుకున్న తరువాత అతని భార్య అతనికి విడాకులు ఇచ్చిందని, మిగిలిన నలుగురు ప్రియురాళ్ళు కూడా అతనిని వదలి వెళ్ళిపోయారని పత్రిక తెలియజేసింది. ఇతర చైనీస్ పత్రికలు కూడా ఈ ఉదంతం గురించి ప్రముఖంగా ప్రచురించాయి. కాని అవేవీ ఫాన్ వయస్సు,వృత్తి వంటి వివరాలేవీ వెల్లడి చేయలేదు.
Pages: -1- -2- 3 News Posted: 18 February, 2009
|