ప్రియురాలి ప్రతీకారం!
ఆ మహిళ 2000లో కింగ్ దావో నగరంలో పని చేస్తున్న సమయంలో ఒక రెస్టారెంట్ లో ఫాన్ అనే ఇంటిపేరు గల బిజినెస్ మాన్ ను కలుసుకుంది.ఆ పరిచయం ప్రణయంగా మారి ఆమె అతనికి ప్రియురాలు అయింది. ఫాన్ ఆ తరువాత ఆమెను తన నలుగురు ప్రియురాళ్ళకు పరిచయం చేసాడు. వారిలో ఇద్దరు అతని దగ్గర పనిచేసేవారే. మరో ఇద్దరు అతనికి ఒకప్పుడు క్లయంట్లు. అతను వారందరికీ నెలకు 5000 యువాన్లు (దాదాపు రూ. 36500) అలవెన్స్ ఇచ్చేవాడని, అద్దె లేని అపార్ట్ మెంట్ లో వారికి వసతి కల్పించాడని తెలుస్తున్నది.
అయితే, ఫాన్ వ్యాపారానికి కష్టకాలం దాపురించడంతో అతను వారిలో ఒకరిని తప్ప మిగిలిన అందరినీ వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మే నెలలో ఒక హోటల్ లో ఫాన్ తన ప్రియురాళ్ళ మధ్య ఒక పోటీ పెట్టారు. ఈ పోటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించే బాధ్యతను ఫాన్ మోడలింగ్ ఏజెన్సీకి చెందిన ఒక ఇన్ స్ట్రక్టర్ కు అప్పగించాడు. కాని ఈ పోటీ ఎందుకు పెడుతున్నది ఫాన్ తన ప్రియురాళ్ళతో చెప్పలేదు.
Pages: -1- 2 -3- News Posted: 18 February, 2009
|