'కాంగ్రెస్ మట్టి కరుస్తుంది'
హన్మకొండ లోక్ సభా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన తాను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా లోక్ సభలో తెలంగాణ వాణిని వినిపించినట్లు చెప్పారు. భూపాలపల్లిలో ఎ.పి. జెన్కో విద్యుత్ కేంద్రం ఏర్పాటు, జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు కృషిచేసినట్లు చెప్పారు. తెరాస ఆవిర్భావంతోనే దేవాదుల ఎత్తిపోతల పథకం, మొన్నటికి మొన్న శంకుస్థాపనకు నోచుకున్న కంతాలపల్లి ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
సంక్షేమ పథకాలను ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నదన్నారు. అయితే, సంక్షేమ పథకాలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సమైక్యాంధ్ర నినాదాన్ని మార్చుకున్న టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న దాంట్లో అనుమానాలకు తావులేదన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ పది జిల్లాలను 20 జిల్లాలుగా విభజిస్తామని వినోద్ కుమార్ చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు వంటి అనేక అంశాలను తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు రూపకల్పన చేస్తున్నారన్నారు.
ఉత్తర తెలంగాణలో ఉన్న తెరాస ప్రభావం దక్షిణ తెలంగాణలో అంతగా లేకపోవడానికి ఆర్థిక అసమానతలు, ధైర్య సాహసాలే కారణం అని ఒక ప్రశ్నకు వినోద్ కుమార్ జవాబిచ్చారు. వరంగల్ జిల్లాలోని 7 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానంలో తెరాస పోటీ చేస్తుందన్నారు. శాసన మండలి ఎన్నికల్లో బరిలో దిగిన టిడిపి అభ్యర్థి డాక్టర్ టి. నర్సింగారావ్ విజయం కోసం కలిసి పనిచేస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి ఎపియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు కంకట రాజారాం, అధ్యక్షత వహించారు. ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెండెం వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి వల్లాల వెంకట రమణ పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 19 March, 2009
|