'వంటకే మాన్యత పరిమితం'
?దత్ సాహెబ్ (సునీల్ దత్ ) మిమ్మల్ని నటుణ్ణి చేయాలని అనుకోలేదట...
- నిజం. నన్ను బాగా చదివించాలని అనుకునేవారు. అయితే చదువుల కంటే నటనే సులభమని నా ఆలోచన. దాంతో నటననే ఎంచుకున్నాను. నటుణ్ణి కావాలనుకుంటున్నట్టు నాన్నతో చెప్పాను. ఆయన ట్రైనింగ్ కు పంపిన తర్వాతే నటించడం ఎంత కష్టమనేది తెలుసుకోగలిగాను.
?మీరు ఇండస్ట్రీ రియల్ 'భాయ్' కదూ...
- రియల్ గాంధీ ఆఫ్ ఇండస్ట్రీ అనుకోవచ్చు. ఎందుకంటే సినీరంగంలోని అన్ని విభాగాలకు చెందిన వారిలోనూ నాకు ఎందరరెందరో మిత్రులున్నారు. ఫలితంగా ఎవరి మధ్యా ఎలాంటి విభేదాలు లేకుండా మధ్యవర్తిత్వం జరపడం సాధ్యమవుతుంది.
?సల్మాన్, షారూక్ ల విషయంలోనూ మధ్యవర్తిత్వం నడిపినట్టు నా దృష్టికి వచ్చింది
- అలాంటిదేమీ లేదు. సినిమా పరిశ్రమ అంటే ఒక కుటుంబానికి చెందిన వాళ్లమనే భావన నాది. ప్రతి కుటుంబంలోనూ ఏదో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే ఏదో విధంగా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిందిగా ఆ ఇద్దరినీ నేను రిక్వెస్ట్ చేశాను.
Pages: -1- 2 -3- -4- -5- -6- News Posted: 20 March, 2009
|