'వంటకే మాన్యత పరిమితం'
?మీరు రాజకీయాల్లోకి రావాలనీ, ఎన్నికల్లో పోటీ చేయాలని మాన్యత నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసిందనే మాటలో నిజమెంత
- మాన్యత తీసుకునే నిర్ణయం కేవలం వంట గదికి సంబంధించినంత వరకే పరిమితం. ఏ వంటలు చేయాలన్నదానికే పరిమితమవుతుంటుంది. రాజకీయాల్లోకి రావాలనేది కేవలం, నేనూ, అమర్ సింగ్ కలిసి తీసుకున్న నిర్ణయం.
?మీ కుటుంబ సభ్యులు చిరకాలంగా కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. మీరు మాత్రం సమాజ్ వాది పార్టీని ఎంచుకున్నారు. ఎందువల్ల
-నేను కాంగ్రెస్ ను వీడలేదు. కాంగ్రెస్-సమాజ్ వాది భాగస్వామ్య పార్టీలుగా పోటీ చేస్తున్నాయి. ఆ రకంగా చూస్తే నేను కాంగ్రెస్ తో ఉన్నట్టే.
?'మున్నాబాయ్' చిత్రాల ద్వారా వచ్చిన పేరు నుంచి లబ్ది పొందడానికే రాజకీయాలను ఎంచుకున్నారా
-నిశ్చయంగా కాదు. ముంబాయిలో జరిగిన 26/11 టెర్రరిస్టు దాడులే నాలో రాజకీయాల్లోకి రావాలనే ప్రేరణ కలిగించాయి. 60 గంటల పాటు జనం అతలాకుతులమయ్యారు. పన్నులు కడుతూ దేశాన్ని నడుపుతున్న సామాన్య మానవుడిని ఎవరూ పట్టించుకున్న దిక్కే లేదు. జనాలకు నా వాణి వినిపించడానికే రాజకీయాల్లోకి ప్రవేశించా.
Pages: -1- -2- -3- -4- 5 -6- News Posted: 20 March, 2009
|