రోడ్డెక్కిన టాటా కల-నానో
న్యూఢిల్లీ: కార్లు ఆయన కలలు. కలలు కల్లలుగా మగలకుండా రొడ్డెక్కేందుకు ఆయన ఎంతో శ్రమ పడ్డారు. సగటు భారతీయునికి కార్లు అందుబాటులోకి రావాలని ఆయన ఆశించారు. సాధించారు. ఆయనే రతన్ టాటా. రతన్ టాటా 2003 జనీవా మోటార్ షోలో లక్ష రూపాయల కారును తయారు చేయబోతున్నట్లు తొలిసారి ప్రకటించారు. ఆరేళ్ళ క్రితం అలాంటి కారు రూపకల్పనపై తీవ్ర అపనమ్మకం కొనసాగింది. అంత చౌకైన కారును తయారు చేయడం అసాధ్యమని స్వదేశీ విదేశీ ఆటోమొబైల్ సంస్థలు రతన్ టాటాను ఎద్దేవా చేశారు. అలాంటి కారును రూపొందించడంలో టాటా పలు సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది.
చౌకైన కారు గురించిన రతన్ టాటా కల నానో రూపంలో సాక్షాత్కరించింది. అయితే వాణిజ్య ఉత్పత్తి కోసం పశ్చిమ బెంగాల్ లో నెలకొల్పిన కారు ప్రాజెక్టుకు పురిటిలోనే సంధి కొట్టింది. నానా ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిపై వివాదం చెలరేగడంతో ఉత్పత్తి కార్యకలాపం గాడి తప్పింది. వెంటనే నానో ప్రాజెక్టు నిర్మాణాన్ని గుజరాత్ రాష్ట్రానికి టాటా బదలాయించారు. గుజరాత్ లో మాతృ సంస్థ నిర్మాణం జరిగే లోపు నానో కార్లను ఉత్తరాంచల్, పుణె టాటా మోటార్స్ ఆటోమొబైల్ యూనిట్లలో విడి విడిగా తయారు చేసేందుకు టాటా మోటార్స్ సంకల్పించింది. సోమవారం నాడు ముంబైలో నానో విడదలతో రతన్ టాటా కల సాకారమైంది.
18 ఏళ్ల నుండి 1.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టాటా గ్రూపుకు చైర్మన్ అయిన రతన్ టాటా ఇన్నేళ్లుగా పెను సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. 54 ఏళ్ల వయసులో రతన్ టాటా చైర్మన్ పదవిని చేపట్టారు. చేపట్టినప్పటి నుండి అతని చైర్మన్ గిరి ముళ్లకిరీటంలా నిలిచింది. బాంబే హోస్ లో అంత పెద్ద వాణిజ్య సంస్థకు అతి పిన్న వయసులో అధిపతిగా నిలిచి గెలవడం అత్యంత కష్టసాధ్యమైన వ్యవహారం. టాటా గ్రూపుకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్స్, డైరెక్టర్లకు రిటైర్మెంట్ పాలసీని ప్రవేశపెట్టేందుకు టాటా స్టీల్ బాస్ రూసీ మోడి లాంటి దిగ్గజాలతో బహిరంగంగా తలపడాల్సి వచ్చింది. ఆయన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో తీవ్ర అంతర్గత సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది.
Pages: 1 -2- -3- -4- -5- News Posted: 23 March, 2009
|