రోడ్డెక్కిన టాటా కల-నానో
1990ల్లో ఏర్పడిన కొత్త రకమైన వ్యాపార-వాణిజ్య అవకాశాల నేపథ్యంలో టాటా గ్రూప్ కు పలు కొత్త కార్పొరేట్ సంస్థల నుండి సవాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ దశాబ్దంలో ప్రధాన భాగమంతా సొంతగ్రూప్ ను సరిదిద్దుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరికొత్ రిటైర్ మెంట్ పాలసీని తీసుకరావడమే కాకుండా, గ్రూప్ కు సంబంధించిన షేర్ హోల్డింగ్ పెంచుకోవలసిన సవాలును సైతం రతన్ టాటా సమర్ధవంతంగా ఎదుర్కున్నారు. అదే సమయంలో గ్రూప్ లోని వివిధ కంపెనీలపై బోర్డు పట్టు బిగించారు. ఇప్పటికీ టాటా గ్లోబల్ ద్వారా పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలను కొనుగోలు చేసి, ఇలాంటి ఆర్ధికంగా గడ్డు పరిస్థితుల్లో కూడా పలు కార్యకలాపాలను చేపట్టాలని రతన్ టాటా ఉవ్విళ్లూరుతున్నారు. కార్లును తయారు చేయడమంటే రతన్ టాటా కు మహా ఇష్టం.
ట్రక్కులను, వాణిజ్యపరమైన వాహనాలను తయారు చేసే టెల్కో సంస్థను కార్లను తయారు చేసే టాటా మోటార్స్ సంస్థగా మార్చడం సులువైన పని కాదు. ఇందులో చాలా దశలున్నాయి. మొదటగా సియర్రా, ఎస్టేటా అనే సూడో కార్లను 1990-95 మధ్యకాలంలో రతన్ టాటా తయారు చేయించారు. ఈ కార్ల తయారీ ట్రక్కుల తయారీ నుండి ఒక అడుగు ముందుకు వేసినట్లు లెక్క. జెన్ సైజులో, అంబాసిడర్ అంతర్గత ప్రమాణాలతో, మారుతి 800 కారు ధరలో, డీజిల్ తో నడిచే టటా ఇండికా కారును తయారు చేసారు. 1998లో విడుదలైన కారు ఒక రకంగా కార్ల అమ్మకాల్లో విప్లవం సాధించిందనడం అతిశయోక్తి కాదేమో.
Pages: -1- -2- 3 -4- -5- News Posted: 23 March, 2009
|