రోడ్డెక్కిన టాటా కల-నానో
మోడీ దర్బారీ, సేథ్, అజిత్ కేర్కర్ లాంటి హేమాహేమీలు టాటా గ్రూప్ పై ఆధిపత్యం వహించేవారు. దాంతో రతన్ టాటా ప్రవేశపెట్టిన పలు వ్యూహాలు, పథకాలు ఆమోదం లభించేది కాదు. అలాంటి హేమాహేమీలను ఒక్కొరిగా వదిలించుకునేందుకు రతన్ టాటా చాలా శ్రమ పడవలసి వచ్చింది. ఆలాంటి ఆటంకాలు తొలిగించుకున్నప్పటికీ, టాటా గ్రూప్ ను పునిర్మించడం రతన్ టాటాకు పెను సవాలుగా నిలిచింది. టాటా గ్రూపుకు సంబంధించిన పలు వ్యాపారాలు లాభసాటిగా లేవు. ఏవో నత్త నడక నడుస్తుండేవి. గిడసబారి, బోరజాచకున్న అతి పెద్ద టాటా గ్రూప్ నుం మారుతున్న పరిస్థితుల రీత్యా పరుగులు తీయంచక పోతే పూర్తిగాకుప్పకూలి పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రతన్ టాటా అధిపతిగా ఎంపికయ్యారు. దేశంలో వస్తున్న పలు సరళీకరణ ఆర్ధిక విధానాల దృష్ట్యా టాటా గ్రూపు తన సామర్ధ్యాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలోని మారిన పరిస్థితుల కనుగుణంగా టాటా గ్రూప్ ను పురనిర్మించే క్రమంలో రతన్ టాటా ప్రస్థానం సాగింది. ఫాస్ట్మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎమ్ సిజి) వ్యాపారాలన్ని చతికిలబడ్డంతో వాటిని గ్రూప్ తెగలనమ్మివేసింది. టాటా స్టీల్ లాంటి దిగ్గజాలు కుంటుతూ నడుస్తున్నాయి. వాటికి సమర్ధవంతమైన నాయకత్వం అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మారిన ఆర్ధిక పరిస్థితితుల కనుగుణంగా వాటిని ప్రగతి బాట పట్టించకపోతే ఆ సంస్థలు పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. రతన్ టాటా చైర్మన్ గా ఎన్నికైన తొలి రోజులు చాలా గడ్డుగా ఉండేవి.
Pages: -1- 2 -3- -4- -5- News Posted: 23 March, 2009
|