రోడ్డెక్కిన టాటా కల-నానో
2000 సంవత్సరం నుండి టాటా అంతర్జాతీయ మార్కెట్లపై కేంద్రీకరించారు. యుకెకి చెందిన టెట్లీ టీని, పలు హోటళ్లను, టెలికామ్ సంస్థలను, స్టీల్ వ్యాపార సంస్థలను ఆయన కొనుగోలు చేసారు. అయితే వాటిలో అతి పెద్ద కొనుగోలు లావాదేవీగా 2007 లో అమెరికా స్టీల్ కంపెనీ, కోరస్ గ్రూప్ ను రతన్ టాటా 12 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం అద్బుతంగా భావించవచ్చు. ఈ మధ్యకాలం 2008లో, ప్రపంచ ప్రఖ్యాత జాగ్వార్ కార్ సంస్థలను, ల్యాండ్ రోవర్ కార్లను 2.3 బిలియన్ డాలర్లకు ఆయన కొనుగోలు చేసి చరిత్ర సృష్టించారు.
ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను కొనుగోలు చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యాపారాన్ని రతన్ టాటా చేపట్టారు. దాంతో అంతర్జాతీయంగా టాటా అన్న పేరు ఒక ప్రముఖ భారతీయ బ్రాండ్ గా నిలవడం గర్వ కారణంగా పేర్కొనాలి. అయితే టాటా గ్రూప్ కు మరో పెను సవాలు వచ్చి మీద పడింది. అంతర్జాతీయంగా కొనుగోలు చేసిన పలు ప్రఖ్యాత బ్రాండ్లకు గాను తీసుకున్న రుణాల్ని చెల్లించేందుకు టాటా గ్రూప్ కంపెనీలు చాలా పెద్ద మొత్తాల్ని చెల్లించవలసి వస్తోంది. టాటా కంపెనీల అకౌంట్ పుస్తకాల్లో దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల రుణం చెల్లించాలని తేలింది. టాటా గ్రూపు సంపాదించిన ఆదాయాల్లో 60 శాతం గ్లోబల్ మార్కెట్ల నుండి సంపాదించిన విషయం తెలిసిందే. అయితే దశాబ్దాల నుండి సంపాదించిన ఆదాయం ప్రపంచ ఆర్దిక సంక్షోభం దెబ్బకు తుడిచిపెట్టుక పోయేట్లు ఉంది.
రతన్ టాటా తిరిగి కెరీర్ క్రాస్ రోడ్ల వద్దకు చేరుకున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినాటి నుండి ఆయన చాలా విజయాలను సాధించినప్పటికీ, ఒక్క ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వాటన్నిటిని తుడిచి పెట్టుకుపోయినట్లయ్యింది. రతన్ టాటా అధ్బుతాలను సాధించిన దురదృష్టవంతులుగా మిగిలారు. భారత దేశ దుమ్ము రోడ్లపై నానో పరుగులు తీసినప్పటికీ తనను ఎవరు అధిగమిస్తారని రతన్ టాటా నిరంతరం ఆలోచిస్తూనే ఉండొచ్చు.
Pages: -1- -2- -3- 4 -5- News Posted: 23 March, 2009
|