ప్రేమకు 'మాంద్యం'లేదు
ముంబై: ప్రపంచ మహా సంక్షోభం సమాజంలోని సకల జీవిత రంగాల్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా వాణిజ్య-వ్యాపార రంగాలు తీవ్ర మాంద్యంలోకి జారిపోయాయి. అయితే వాలెంటైన్స్ డే వ్యాపారం మాత్రం చెక్కుచెదరలేదు సరకదా, మరింతగా విస్తరించడం విశేషం. ప్రేమకు మరణంలేదు, ప్రేమకు అది లేదు, ఇదిలేదు అని కవులు రాస్తుంటే, ఏదో అతిశయోక్తిగా రాస్తున్నట్లు అనిపించవచ్చు. అయితే 'ఆర్ధిక మాంద్యం' ప్రేమతో ముడిపడిన వాలెంటైన్స్ డే వ్యాపారాన్ని ఏమీ చేయలేకపోవడంతో కవులు చెప్పినది నిజమనిపిస్తోంది.ఈసారి వేలంటైన్స్ డే కి కూడా ఆ వ్యాపారస్తులు పలు ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకొచ్చారు.
వేలంటైన్స్ డే సందర్భంగా ఆభరణాల వ్యాపారానికి బాగా డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది ఆభరణాల వ్యాపారం రికార్డు స్థాయిలో జరుగనుంది. వైవిధ్యభరితమైన ఆభరణాలు, హ్యాంగ్ఔట్ చైన్లు ప్రత్యేక ప్యాకేజీలతో,డిస్కౌంట్లతో, మినహాయింపులతో మార్కెట్లోకి రాబోతున్నాయి. మార్కెట్ ఉదాసీనత ఒకవైపు కనబడుతున్నప్పటికీ వేలంటైన్స్ డేకి అమ్మకాలు పుంజుకోగలవని కంపెనీలు ఆశిస్తున్నాయి. దీపావళి తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే పర్వదినమిది.'దీపావళి పండుగ తర్వాత రెండవ అతి పెద్ద పర్వదినమైన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రజలు పక్షం రోజులు ముందు నుండే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. మా వార్షికాదాయంలో 10శాతం ఈ సందర్భంగా వస్తుంది'అని ఫైన్ జుయలరీ డైరెక్టర్ సోహిల్ కొఠారి తెలిపారు. ఫైన్ జుయలరీ సంస్థ 'నిర్వాణ'బ్రాండ్ పేరు మీద ఆభరణాలను అమ్ముతోంది.
Pages: 1 -2- -3- News Posted: 11 February, 2009
|