వజ్ర ఖచిత అభ్యర్థి!
అహ్మదాబాద్ : వేళ్ళకు అలంకరించిన వివిధ రంగుల వజ్రాల ఉంగరాలు ఖీమ్జీ పటాడియా చేతులు ఊపినప్పుడల్లా కాంతులు విరజిమ్ముతుండగా సురేంద్రనగర్ ఓటర్లు అప్రతిభులై ముకుళిత హస్తాలతో ఆయనకు తమ సమస్యలు మొర పెట్టుకుని పరిష్కారాన్ని కోరుకుంటుంటారు. ఆయన అలాగే చేస్తానని హామీ ఇస్తుంటారు. దాహ బాధతో తల్లడిల్లుతున్న ఈ గుజరాత్ జిల్లాలో ఒక పౌరుడు ఆయనతో 'అసలు నీరే లేదు. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు' అని మొర పెట్టుకున్నాడు. అందుకు పటాడియా స్పందిస్తూ, 'తమరో ప్రాబ్లెమ్ సాల్వ్ కర్వో మారా డాబా హాథ్ నొ ఖేల్ చె. ఏక్ ఫోన్ కరినే థోడా పైసా వాపర్వానా చె. పన్ అచర్ సంహిత నదే చె' (మీ సమస్య ఇప్పుడే పరిష్కరించేందుకు నా వద్ద డబ్బు ఉన్నది. ఒక్క ఫోన్ కాల్ చాలు. తగినంత డబ్బు ఇక్కడికి వస్తుంది. కాకపోతే నేను అలా చేయాలన్నా ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డు వస్తున్నది' అని చెప్పారు.
ఆ తరువాత ఆయన వద్దకు నిరుద్యోగులుగా మారిన బ్యాంక్ ఉద్యోగులు కొందరు వచ్చారు. వారు సురేంద్రనగర్ పీపుల్స్ సహకార బ్యాంకులో పనిచేస్తుండేవారు. అది కొన్ని సంవత్సరాల క్రితం మూతపడింది. దాని పునరుద్ధరణకు కావలసిన రూ. 14 కోట్లను స్థానిక కాంగ్రెస్ గాని, భారతీయ జనతా పార్టీ (బిజెపి) గాని సమీకరించలేకపోయాయి. పటాడియా నవ్వేస్తారు. 'మీ బ్యాంకును కాపాడేందుకు ఇతర పార్టీలు విరాళాల వసూలుకు ప్రయత్నించవలసిన అవసరం ఉంది. కాని నాకు లేదు. రూ. 14 కోట్లు నాకు ఒక లెక్క కాదు' అని ఆయన చెబుతారు. నోట మాట రాని సందర్శకులు ఆయన మాటలకు అవునన్నట్లుగా తలలు ఊపుతారు.
ముంబైకి చెందిన అంతగా పేరు ప్రఖ్యాతులు లేని రియల్టీ, నగల వ్యాపారవేత్త పటాడియా మొదటిసారిగా స్వస్థలం సురేంద్రనగర్ నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. తన ఆస్తుల విలువ రూ. 514 కోట్లకు పైనేనని ఆయన స్వయంగా ప్రకటించారు. గురువారం పిలిభిత్ లో కాంగ్రెస్ తరఫున వి.ఎం. సింగ్ నామినేషన్ దాఖలు చేసి తన ఆస్తుల విలువ రూ. 632 కోట్లు అని ప్రకటించేంత వరకు పటాడియా లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు అందరిలోకి సంపన్నుడు.
Pages: 1 -2- -3- News Posted: 24 April, 2009
|