బలితీసుకున్న 'గోత్రం' 'పెళ్ళంటే నూరేళ్ళపంట. అది పండాలి కోరుకున్నవారి ఇంట' అని ఏ వధువైనా ఆశిస్తుంది. ఏ ఆడపిల్ల తల్లితండ్రులైనా తమ పిల్ల కాపురం పచ్చగా పదికాలాల పాటు వర్థిల్లాలని కోరుకుంటారు. అందుకనే... కొన్ని సందర్భాల్లో... మంచి సంబంధం మాట్లాడాక సగోత్రికులని చివర్లో తెలిస్తే... సంబంధాన్ని వదులుకోలేక వధువునో, వరుడినో దత్తు ఇచ్చి వివాహం చేసే ఆనవాయితీ ఉంది తెలుగునాట. ఈ విధంగా ఏక గోత్రాన్ని భిన్న గోత్రంగా మార్చడం తెలియదో ఏమో కానీ... నరాల్లో జీర్ణించుకున్న మూర్ఖత్వం... పెద్దలమన్న అహంకారం కూతురి పసుపుకుంకుమలనే బలి తీసుకుంది. మూఢత్వం అంతటితో ఆగకుండా... అత్యాచారం కూడా జరిగేందుకు దారితీసింది. వీరి పశుత్వం బారి నుంచి తప్పించుకున్న ఆ 'విధి వంచిత' పోలీసులను ఆశ్రయించింది. షాక్ కు గురైన ఆమెకు సాంత్వన చేకూర్చేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్న సంఘటన అవుటర్ ఢిల్లీలో జరిగింది. తండ్రి కారణంగానే అన్యాయానికి గురైన అభాగిని చేసిన పాపం ఏమిటంటే ప్రేమించి... పెళ్ళి చేసుకున్న వరుడి గోత్రం, వీరి గోత్రం ఒకటి కావడమే! సంచలనం కలిగించిన ఈ సంఘటనలో పోలీసులు మృతుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు... బాధితురాలి తండ్రి దయాసింగ్ (50), బంధువు సందీప్, అతని స్నేహితులు పవన్, ఇంద్రజిత్ లను అరెస్ట్ చేశారు.
హర్యానాలోని సోన్ పట్ జిల్లా మహర్ గ్రామానికి చెందిన 18 ఏళ్ళ శైలజ (పేరు మారింది) తనకన్నా చదువులో రెండేళ్ళ సీనియర్ అయిన వీరేందర్ సింగ్ ను ప్రేమించింది. వారి గోత్రాలు ఒకటే అయిన కారణంగా వారి కుటుంబాలు, గ్రామస్తులు వారిద్దరి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామస్తులు, కుటుంబ పెద్దలకు నచ్చచెప్పలేకపోయిన ఈ జంట 2006 అక్టోబర్ లో ఇంటినుంచి పారిపోయారు. అప్పటికే వారిద్దరూ మేజర్లు... శైలజ వయసు 18, వీరేందర్ వయసు 19.
Pages: 1 -2- -3- News Posted: 28 October, 2009
|