నాలుగేళ్ళలో ఎంత మార్పు
కోలకతా : ఎ.ఆర్. రెహమాన్ బంగారు ఆస్కార్ అవార్డు ప్రతిమను అందుకోవడానికి వేదికపైకి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. అవార్డు అందుకుంటున్న భావన ఎలా ఉంటుందో ప్రీతీ ముఖర్జీకి కచ్చితంగా తెలుసు. నాలుగు సంవత్సరాల క్రితం ఆమె లాస్ ఏంజెలిస్ కోడక్ థియేటర్ లో అదే వేదికపై ఉన్నది. అక్కడ ఆమె ఆస్కార్ ప్రతిమను పొదివి పట్టుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. అప్పటి నుంచి ఆమె ఒక్కసారి అవార్డుల ప్రదానోత్సవాన్ని మిస్ కాలేదు. అవార్డుల ప్రదానోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికై సోమవారం తెల్లవారు జామున ఆమె నిద్ర లేచింది. సోనాగాచ్చిలో దైనందిన కార్యక్రమాలను ప్రారంభించడానికి ముందే ఆమె ఈ కార్యక్రమాన్ని టివిలో చూసింది.
ఆసియాలో అత్యంత పెద్దదైన వ్యభిచార ప్రాంతంలో పూజ పేరుతో వ్యవహరించే ప్రీతి ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత సరిగ్గా సంవత్సరానికే ఈ వ్యభిచార వృత్తిని స్వీకరించవలసి వచ్చింది.
2005లో జనా బ్రిస్కి దర్శకత్వం వహించిన, ఆస్కార్ గెలుచుకున్న 'బోర్న్ ఇంటూ బ్రోథల్స్' డాక్యుమెంటరీలో ప్రీతికి పాలు పంచుకుంది. చిత్రంలోని బాలతారలు తొమ్మిది మందీ పెద్ద ఎత్తున చేసిన హర్షధ్వానాలు ఇప్పటికీ ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అవార్డును ప్రకటించినప్పుడు తను జనా బ్రిస్కి గాఢాలింగనం చేసుకోవడం ఇప్పటికీ ఆమెకు గుర్తుంది.
Pages: 1 -2- -3- -4- News Posted: 25 February, 2009
|