'వంటకే మాన్యత పరిమితం'
'ఖల్ నాయక్'గా, 'మున్నాభాయ్'గా జనం హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సంజయ్ దత్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. అదే రాజకీయ నాయకుడి అవతారం. వెండితెర ప్రేక్షకులకు గాంధీని మళ్లీ కళ్ల ముందు నిల్పిన సంజయ్ ఈసారి జనం మనిషిగా రాజకీయాల్లోకి దూకారు. సమాజ్ వాది పార్టీ తరఫున లక్నో నుంచి లోక్ సభ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. సునీల్ దత్, నర్గీస్ దంపతుల కుమారుడైన సంజయ్ దత్ కు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురర్కొన్నారు. వివాదాలలో చిక్కుకున్నారు. అవమానాలూ భరించారు. డ్రగ్స్ కు అలవాటు పడటం, 1993 ముంబై బ్లాస్ట్ ల కేసు, ఎకె 56 రైఫిల్స్ కలిగి ఉన్న నేరం...ఆ తర్వాత జైలుశిక్ష..ఇలా ఎన్నో ఆటుపోట్లు ఆయనను అనుక్షణం వెన్నాడుతూనే ఉన్నాయి. సంజయ్ ను అంతం చేస్తామంటూ అండర్ వరల్డ్ నుంచి వచ్చిని హెచ్చరికలకూ కొదవలేదు. అయినా కింద పడిన ప్రతిసారీ అంతే వేగంగా పైకి లేవడం, చెక్కుచెదరని చిరునవ్వుతో విజయ సోపానాలు అందిపుచ్చుకోవడం ద్వారా లక్షలాది మంది ప్రజల మనసులను సంజూ గెలుచుకున్నారు.
సంజయ్ దత్ ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఇటీవలే కాలం చేసిన ఆయన తండ్రి సునీల్ దత్తం రాజకీయనాయకుడిగా ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారు. తండ్రి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్న సంజయ్ సోదరి ప్రియ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.సంజయ్ మాత్రం సమాజ్ వాది పార్టీ తీర్థం తీసుకున్నారు. దేశమంతా ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉన్న తరుణంలో ప్రముఖ జర్నిలిస్ట్ రజత్ శర్మ ఇండియా టీవీ హిట్ సిరీస్ 'ఆప్ కి అదాలత్' కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ గెస్ట్ గా సంజయ్ దత్ ఇందులో పాల్గొన్నారు. తన సోదరి ప్రియకు సన్నిహితంగా ఎందుకు ఉంటున్నాననే విషయం, రాజకీయాల్లో ప్రవేశించడం వెనుక తన ఉద్దేశం, బాలీవుడ్ లో మిత్రులు-విరోధులు, తన భార్య మాన్యత తదితర అంశాలపై సంజయ్ తన మనోభావాలను వెల్లడించారు. సంజయ్ తో రజత్ శర్మ క్విక్ ఛాట్ ఇలా సాగింది...
Pages: 1 -2- -3- -4- -5- -6- News Posted: 20 March, 2009
|